DNational 14 Mar: పెళ్లి మండపం వధూవరులు, బంధువుల సందడితో కళకళలాడుతోంది. మరికొద్ది సేపట్లో శుభముహూర్తం అనగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పెళ్లికొడుకు అవతారంలో ఉన్న ఒక గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు సినిమా ఫక్కీలో అరెస్ట్ చేశారు. ఈ ఘటన కో-ఎ-ఫిజా పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

చాలా కాలంగా పరారీలో ఉన్న ఒక మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు కో-ఎ-ఫిజా ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసుకుంటున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి బట్టల్లో ఉన్న నిందితుడిని చుట్టుముట్టారు.

తన కాబోయే భర్త నేరచరిత్ర గురించి తెలియని వధువు, పోలీసుల రాకతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. తన జీవితం పాడైపోతుందని, కనీసం పెళ్లి వేడుక పూర్తయ్యే వరకు వేచి ఉండాలని పోలీసులను ఆమె ప్రాధేయపడింది. “ముందు పెళ్లి జరగనివ్వండి, ఆ తర్వాత తీసుకెళ్లండి” అని ఆమె కన్నీళ్లతో వేడుకున్నప్పటికీ, నిందితుడిపై ఉన్న తీవ్రమైన కేసుల దృష్ట్యా పోలీసులు వెనక్కి తగ్గలేదు.

నిందితుడిపై హత్యాయత్నం, దోపిడీ వంటి పలు తీవ్రమైన కేసులు ఉన్నాయని కో-ఎ-ఫిజా పోలీసులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత మధ్య నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో పెళ్లి నిలిచిపోవడమే కాకుండా, స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By Adhitya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana