DNews:12 Mar: తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువు ముగియడానికి ఒక్క రోజు ముందే, అంటే నిన్న (బుధవారం) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. పిటిషనర్లు సమర్పించిన మీడియా క్లిప్పింగ్‌లు, వార్తాపత్రికల కటింగ్‌లు వారు పార్టీ మారినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు కావని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. వారు ఇప్పటికీ సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, ఆ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

దీంతో గతేడాది డిసెంబర్ నుండి విడతల వారీగా విచారణ జరిపిన స్పీకర్, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు (దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య తదితరులు) క్లీన్‌చిట్ ఇచ్చినట్లయింది. అయితే, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ గతంలోనే బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసి గడువు విధించింది. ఈ నేపథ్యంలో, స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయంపై సుప్రీంకోర్టు నేడు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్పీకర్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును లేదా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చిస్తోంది.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana