DET:MAR 09:
కొత్త విడుదల తేదీ:
తొలుత ఈ చిత్రాన్ని 2025 క్రిస్మస్‌కు విడుదల చేయాలని భావించినప్పటికీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా మేకర్స్ తేదీని మార్చారు.ఇప్పుడు ఆల్ఫా 2026 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

షూటింగ్ అప్‌డేట్స్:
దర్శకుడు శివ రవైల్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇటీవల ముంబైలో జరిగిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌లో ఆలియా భట్,శర్వరీ వాఘ్ పాల్గొన్నారు.ఈ సినిమాలో వీరిద్దరూ సూపర్ స్పైలుగా కనిపించబోతున్నారు.హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ సినిమా స్టంట్స్ చిత్రీకరిస్తున్నారు.

స్పై యూనివర్స్ కనెక్షన్:

ఆల్ఫా సినిమాతో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పఠాన్,టైగర్,వార్ మరింత విస్తరించబోతోంది.ఇందులో హృతిక్ రోషన్ ఏజెంట్ కబీర్ లేదా షారుఖ్ ఖాన్ పఠాన్) అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందనే వార్తలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.