
DET:MAR 09:
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025:
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రారంభించింది.2024లో విడుదలైన చిత్రాలకు గాను 2025 సంవత్సరపు అవార్డులను తాజాగా ప్రకటించారు.ఇందులో భాగంగా భారతీయ సినీ రంగానికి చిరంజీవి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేయనున్నారు.
అవార్డు ప్రధానోత్సవం:
ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకను మార్చి 19,2026న ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఈ వేడుక జరగనుంది.
ఇతర ప్రముఖులకు దక్కిన గౌరవం:
చిరంజీవితో పాటు మరికొందరు సినీ దిగ్గజాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు దక్కాయి.కమల్ హాసన్ పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ.జయసుధ అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్,సింగీతం శ్రీనివాసరావు బి.ఎన్. రెడ్డి ఫిల్మ్ అవార్డ్, అశ్వినీ దత్ నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డ్,సుద్దాల అశోక్ తేజ సి. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్.
మెగాస్టార్ స్పందన:
ఈ అవార్డుపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. లెజెండరీ ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్న అవార్డును అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం.నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్యకు ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
