I don't have any direction for the children I have... Should I have three-DTv Telangana

DNews: Mar07: చంద్రబాబు గారి పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం. ఉన్న బిడ్డలకే దిక్కులేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా ?
మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా ? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు. మీరు, జగన్ గారు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు. మాఫియాలు చేసుకుంటూ.. రాష్ట్రాన్ని దోచుకుంటూ బిడ్డలను కనమని చెప్తే ఎలా చంద్రబాబు గారు ? అంటూ షర్మిల ధ్వజమెత్తారు.