DET:MAR 07:
ర్యాపర్ బాద్షాకు మహిళా కమిషన్ షాక్:
మార్చి 1, 2026న విడుదలైన తతేరీ పాటపై హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది.ఈ పాటలో మహిళలను మరియు మైనర్లను కించపరిచేలా అశ్లీల పదజాలం వాడారని కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా మండిపడ్డారు.ఈ మేరకు బాద్షా అదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా మార్చి 13,2026న పానిపట్ లోని డిసి ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.

స్కూల్ యూనిఫాంతో అభ్యంతరకర దృశ్యాలు:

ఈ వివాదానికి ప్రధాన కారణం పాటలో చూపించిన కొన్ని దృశ్యాలు.ఇందులో అమ్మాయిలు స్కూల్ యూనిఫాం ధరించి డ్యాన్స్ చేయడం పాఠశాల వాతావరణాన్ని బాద్‌శాల పాఠశాల అనే పదానికి వికృతంగా అని పిలవడంపై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆయ్ బాద్షా డోలీ చఢానే,ఇన్ సబ్కో ఘోడీ బనానే వంటి లిరిక్స్ అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

రెండు చోట్ల FIR నమోదు:

ఈ వివాదంపై హర్యానా పోలీసులు వేగంగా స్పందించారు.ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో బాద్షాపై FIR నమోదైంది.అశ్లీలత మరియు మహిళలను తప్పుగా చూపించినందుకు గాను భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 296,మరియు మహిళల అసభ్య ప్రాతినిధ్య నిషేధ చట్టం 1986 కింద కేసులు పెట్టారు.జింద్ ఇక్కడ కూడా హర్యానా రోడ్‌వేస్ బస్సును డిపో పేరును అనుమతి లేకుండా వాడినందుకు రవాణా శాఖ ఫిర్యాదు మేరకు మరో FIR నమోదైంది.

యూట్యూబ్ నుంచి తొలగింపు:
వివాదం ముదరడం మరియు పోలీసుల జోక్యంతో బాద్షా అధికారిక యూట్యూబ్ ఛానల్ నుండి ఈ పాటను ప్రస్తుతం తొలగించారు. హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా కూడా ఈ విషయంలో స్పందిస్తూ రాష్ట్ర సంస్కృతిని కించపరిచే ఇలాంటి పాటలను సహించబోమని దీనిపై కఠిన విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana