
DET:MAR 05:
ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య,అభిషేక్:
ముంబైలో జరిగిన అర్జున్ టెండూల్కర్ సానియాల గ్రాండ్ వెడ్డింగ్‌లో ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఈ వేడుకతో తెరపడింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం వేడుకలో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించడం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఐశ్వర్య రాయ్ ఎర్రటి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా అభిషేక్ క్లాసీ షేర్వానీలో కనిపించారు.
సచిన్ కుటుంబంతో ఆత్మీయ పలకరింపులు:
సచిన్ టెండూల్కర్ కుమారుడి పెళ్లి కావడంతో క్రీడా మరియు సినీ రంగ ప్రముఖులు క్యూ కట్టారు.ఐశ్వర్య,అభిషేక్‌లు సచిన్ మరియు అంజలి టెండూల్కర్లను కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు.వీరితో పాటు ఆరాధ్య బచ్చన్ కూడా ఈ వేడుకలో పాల్గొంది.ఈ క్రమంలో తీసిన వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సందడి చేసిన ఇతర ప్రముఖులు:
ఈ వివాహ వేడుకకు కేవలం బచ్చన్ కుటుంబమే కాకుండా షారుఖ్ ఖాన్,రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యారు. టీమ్ ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ తమ కుటుంబాలతో కలిసి వచ్చి సందడి చేశారు అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో:
నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియోలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యను ఎంతో కేరింగ్‌గా చూసుకోవడం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.వీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.విడాకుల వార్తలను ఎక్కడా ఖండించకుండానే తమ ప్రవర్తనతో ఆ వార్తల్లో నిజం లేదని ఈ జంట నిరూపించినట్లయింది.
