DET:MAR 05:
అల్లు శిరీష్ ప్రి-వెడ్డింగ్ రిసెప్షన్:
మార్చి 2,2026 సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు శిరీష్ – నయనికా రెడ్డిల ప్రి-వెడ్డింగ్ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరిగింది.టాలీవుడ్‌లోని అగ్ర హీరోల నుండి యువ నటుల వరకు అందరూ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.స్టూడియో ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో పూల అలంకరణతో ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది.

రామ్ చరణ్,రానా దగ్గుబాటి ప్రత్యేక ఆకర్షణ:

ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ తన సోదరుడు శిరీష్ కోసం ఆయన నల్లటి దుస్తుల్లో విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.అలాగే రానా దగ్గుబాటి,నాని,నాగార్జున – అమల దంపతులు,నాగ చైతన్య నందమూరి బాలకృష్ణ వంటి స్టార్స్ కూడా హాజరయ్యారు.మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఫోటోలకు పోజులివ్వడం అభిమానులకు కనువిందుగా మారింది.

ముఖ్య అతిథులు మరియు సందడి:

కేవలం నటులే కాకుండా ప్రముఖ దర్శకులు అట్లీ,సందీప్ రెడ్డి వంగా,సుకుమార్ కూడా ఈ వేడుకలో కనిపించారు.మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ కూడా ఈ వేడుకకు రావడం విశేషం.అల్లు అరవింద్ మరియు నిర్మల దంపతులు అతిథులందరినీ ఆత్మీయంగా ఆహ్వానించారు.అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డిలు వేడుక అంతటా దగ్గరుండి పనులన్నీ పర్యవేక్షిస్తూ అతిథులతో సరదాగా గడిపారు.

మార్చి 6న అసలైన వేడుక:

ఈ రిసెప్షన్ చిత్ర పరిశ్రమ కోసం గ్రాండ్‌గా నిర్వహించగా అసలైన వివాహం మాత్రం మార్చి 6న అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఏకాంతంగా జరగనుంది.ఇప్పటికే దుబాయ్‌లో యాచ్ పార్టీ,హైదరాబాద్‌లో సాంప్రదాయ పెళ్లి కొడుకు వేడుకలు పూర్తయ్యాయి.శిరీష్ – నయనికల జోడీ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.