
D Spiritual: March 05: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తన పర్యటనను ప్రారంభించారు. కుటుంబ సభ్యులు మరియు తెలంగాణ జాగృతి ముఖ్య నాయకులతో కలిసి ఆమె తిరుమల యాత్రకు శ్రీకారం చుట్టారు.
శంషాబాద్ విమానాశ్రయం నుండి విమానంలో తిరుపతికి చేరుకోనున్న కవిత, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లనున్నారు. స్వామివారిపై ఉన్న భక్తితో కాలినడకన వెళ్లి తన మొక్కులు చెల్లించుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు.
గురువారం సాయంత్రానికి తిరుమల చేరుకోనున్న కవిత, శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకోనున్నారు. స్వామివారి సేవలో పాల్గొని తన మొక్కులు తీర్చుకోనున్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట పలువురు తెలంగాణ జాగృతి ప్రతినిధులు కూడా ఉన్నారు.
