
DNews: Feb27: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాల సరిహద్దుల్లో భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమ గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తమ దళాలు కూల్చివేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆ దేశ భద్రతా దళాలను ఉటంకిస్తూ అక్కడి మీడియా ఈ విషయం తెలిపింది. పాకిస్తాన్ యుద్ధ విమానం కాలిపోతున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరోవైపు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, తమ సైన్యం ఆఫ్ఘన్ దళాలకు తగిన విధంగా స్పందిస్తోందని అన్నారు. దురాక్రమణను అణచివేసే సామర్థ్యం తమ సైన్యానికి ఉందని ఆయన అన్నారు.
