
DSports 26Feb 2026: చెన్నైలోని చిదంబరం (చేపాక్) స్టేడియంలో ఈరోజు భారత్ మరియు జింబాబ్వే మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 కీలక మ్యాచ్కు ముందు మైదానం సిబ్బంది ఒక వినూత్న చర్య చేపట్టారు. రాత్రి సమయాల్లో మైదానాన్ని ముంచెత్తే మంచు (Dew) సమస్యకు చెక్ పెట్టడానికి అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఒక ప్రత్యేక రసాయనాన్ని అవుట్ఫీల్డ్పై స్ప్రే చేశారు.
- చెన్నైలో ప్రస్తుతం హ్యుమిడిటీ (తేమ) 80-90 శాతంగా ఉంది. దీనివల్ల రాత్రి సమయంలో మైదానంలో భారీగా మంచు కురుస్తుంది. ఫలితంగా బంతి తడిగా మారి బౌలర్లకు గ్రిప్ దొరకదు.స్పిన్నర్లు బంతిని టర్న్ చేయడం కష్టమవుతుంది.ఫీల్డర్లు బంతిని పట్టుకోవడంలో ఇబ్బంది పడతారు.
- ఇది రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే జట్టుకు అనవసరమైన సానుకూలత (అడ్వాంటేజ్) కల్పిస్తుంది.దీన్ని నివారించడానికి ‘డ్యూ క్యూర్’ (Dew Cure) అనే ప్రత్యేక రసాయనాన్ని మంగళ, బుధవారాల్లో మైదానమంతా స్ప్రే చేశారు. ఈ రసాయనం గడ్డిపై ఒక పొరలా ఏర్పడి, తేమను గడ్డి ఆకులు పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల బంతి తడవకుండా పొడిగానే ఉంటుంది.
