DSports 19Feb 2026:కల్యాణి (పశ్చిమ బెంగాల్): భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో జమ్మూ కశ్మీర్ జట్టు స్వర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా జరిగిన సెమీఫైనల్‌లో బెంగాల్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 1959-60 సీజన్‌లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్, సుమారు ఏడు దశాబ్దాల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించడం విశేషం.

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కశ్మీర్ జట్టుకు బెంగాల్ మొదటి ఇన్నింగ్స్‌లో గట్టి పోటీనిచ్చింది. సుదీప్ కుమార్ ఘరామీ (146) సెంచరీతో బెంగాల్ 328 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్ అయి, 26 పరుగుల స్వల్ప వెనుకంజలో నిలిచింది.
  • బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో కశ్మీర్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆకిబ్ నబీ (4/36), సునీల్ కుమార్ (4/27) ధాటికి బెంగాల్ కేవలం 99 పరుగులకే కుప్పకూలింది.దీంతో జమ్మూ కశ్మీర్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.