DSports 19Feb 2026:అహ్మదాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, తన రెగ్యులర్ జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ నంబర్ (73) ఉన్న జెర్సీని ధరించి క్రీజులోకి వచ్చాడు. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

  • అభిషేక్ శర్మ తన సొంత జెర్సీని ధరించకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి కామెంటేటర్లు నాజర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అభిషేక్ శర్మ తన కిట్ బ్యాగ్‌ను లేదా జెర్సీని పొరపాటున టీమ్ హోటల్‌లోనే మర్చిపోయారు. మరికొన్ని వార్తల ప్రకారం, అతను తన జెర్సీని గ్రౌండ్‌కు తెచ్చుకున్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అది డ్రెస్సింగ్ రూమ్‌లో అందుబాటులో లేదు. దీంతో సమయం లేకపోవడంతో బెంచ్ మీద ఉన్న సిరాజ్ జెర్సీని వేసుకుని బ్యాటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది.
  • కొందరు దీనిని ‘అదృష్టం’ (Luck) కోసమే చేశాడని భావించినా, జెర్సీ మార్పు అభిషేక్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లో కూడా అతను కేవలం 3 బంతులు ఎదుర్కొని ‘డకౌట్’ అయ్యాడు.గతంలో పాకిస్థాన్, అమెరికా మ్యాచ్‌ల్లోనూ అతను సున్నాకే వెనుదిరిగాడు.దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక డకౌట్లు (5) సాధించిన సంజూ శాంసన్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.
  • ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు తమ కేటాయించిన నంబర్ జెర్సీనే ధరించాలి. అయితే అత్యవసర పరిస్థితుల్లో వేరే వారి జెర్సీ వేసుకుంటే, ఆ నంబర్‌ను టేపుతో కప్పి ఉంచడం లాంటివి చేస్తుంటారు.