
DNews: Feb 18: మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ వెంకటస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కేతనపల్లిలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం లేకుండా మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతూ లాఠీఛార్జ్ చేయడంతో పాటు రాళ్లు రువ్వారని తెలిపారు. దాడి తమ కాన్వాయ్‌పైనే జరిగిందని, మంత్రి కాన్వాయ్‌పై కాదని స్పష్టం చేశారు. “నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి” అంటూ సవాల్ విసిరిన ఆయన, మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని హతమార్చే ప్రయత్నం చేశారని, ఆయన ప్రవర్తన రౌడీగా ఉందని తీవ్రంగా విమర్శించారు.
