DSports 18Feb 2026:న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో సౌతాఫ్రికా జట్టు తన జోరును కొనసాగిస్తోంది. బుధవారం యూఏఈ (UAE) తో జరిగిన గ్రూప్-డి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టీమిండియా లాగే అజేయంగా సూపర్‌-8కు చేరుకుంది.

  • యువ పేసర్ కార్బిన్ బాష్ అద్భుతమైన బౌలింగ్‌తో యూఏఈ బ్యాటర్లను వణికించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.అన్రిచ్ నోర్ట్జే (2 వికెట్లు) కూడా రాణించడంతో యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ బ్యాటర్లలో అలీషాన్ షరాఫు (45) ఒక్కడే కాస్త పోరాడాడు.
  • స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు ఏమాత్రం తడబడకుండా ఆడి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు.’బేబీ ఏబీ’గా పిలవబడే డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (16 బంతుల్లో 30) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (28) బాధ్యతాయుతంగా ఆడాడు.సౌతాఫ్రికా కేవలం 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.