DSports 18Feb 2026:కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో పాకిస్థాన్ మరోసారి మట్టికరిచింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. భారత బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమిపై స్పందించిన దినేశ్ కార్తిక్, బాబర్ అజామ్ బ్యాటింగ్ శైలిని మరియు నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

  • ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ కేవలం 5 పరుగులు (7 బంతుల్లో) మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతను అవుట్ అయిన తీరుపై కార్తిక్ అసహనం వ్యక్తం చేశారు.”బాబర్ అజామ్ ఆడిన ఆ షాట్ చూస్తుంటే అతను మ్యాచ్‌ను ముందే వదిలేసినట్లు అనిపించింది. అది క్లియర్ గా ఒక ‘లొంగుబాటు’ . జట్టును ఎలా గెలిపించాలి లేదా లక్ష్యానికి దగ్గరగా ఎలా తీసుకెళ్లాలి అనే కనీస ఆలోచన కూడా అతనిలో కనిపించలేదు” అని కార్తిక్ విమర్శించారు.
  • తరచుగా బాబర్ అజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చే అభిమానులకు కార్తిక్ గట్టి కౌంటర్ ఇచ్చారు.”ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ ఎప్పుడూ లొంగిపోడు. అతను ఒత్తిడిని స్వీకరించి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కోహ్లీ అంత త్వరగా అంత చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకుంటాడని నేను ఊహించలేను. బాబర్ ఇంకా చాలా నేర్చుకోవాలి” అని కార్తిక్ స్పష్టం చేశారు.