
DSports 18Feb 2026:కోల్‌కతా: భారత దేశవాళీ క్రికెట్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఎప్పుడూ పసికూనగా భావించే జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు, దిగ్గజ జట్లను మట్టికరిపించి రంజీ ట్రోఫీ 2026 ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో శక్తివంతమైన బెంగాల్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి, 67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో మొదటిసారి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించింది.
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జమ్మూకశ్మీర్, తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ను 328 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం జమ్మూకశ్మీర్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు చేసింది. ఇందులో ఐపీఎల్ స్టార్ అబ్దుల్ సమద్ (82), కెప్టెన్ పరాస్ డోగ్రా (58) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్ బౌలర్లు నిప్పులు చెరిగారు.ఆకిబ్ నబీ మరియు సునీల్ కుమార్ చెరో 4 వికెట్లతో చెలరేగడంతో, బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది.దీంతో జమ్మూకశ్మీర్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.
- స్వల్ప లక్ష్య ఛేదనలో జమ్మూకశ్మీర్ ఒక దశలో 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అబ్దుల్ సమద్ (30 నాటౌట్), యువ బ్యాటర్ వంశజ్ శర్మ (43 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. వంశజ్ శర్మ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించగానే జమ్మూకశ్మీర్ ఆటగాళ్లు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు.
