DET:FEB 18:
కళాశాల వేడుకలో కమల్ సందడి:
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన గాంధీ సినిమాను ప్రదర్శించారు.సినిమా ప్రారంభానికి ముందు విద్యార్థులతో ముచ్చటించిన కమల్ తనదైన శైలిలో చమత్కరిస్తూ వాతావరణాన్ని సరదాగా మార్చేశారు.

సెన్సార్‌షిప్‌పై సెటైర్లు:

సినిమా ప్రదర్శన గురించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సెన్సార్ బోర్డు నిబంధనలు ఎలా ఉన్నాయో కమల్ హాసన్ సరదాగా గుర్తు చేశారు.నేడు మనం గాంధీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ రోజుల్లో గాంధీ గారి సినిమా తీయాలన్నా సెన్సార్ కత్తెర ఎక్కడ పడుతుందో అని భయపడాల్సి వస్తోంది అని ఆయన చమత్కరించారు.నిజం చెప్పడం కూడా ఒక్కోసారి సెన్సార్ దృష్టిలో తప్పైపోతుందని ఆయన అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.

గాంధీ సిద్ధాంతాల ప్రాముఖ్యత:

వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా కమల్ హాసన్ ప్రసంగం సాగింది.గాంధీ గారు కేవలం ఫోటోలకే పరిమితం కాకూడదని ఆయన సిద్ధాంతాలు నేటి యువతకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.సెన్సార్ ఆంక్షలు ఎన్ని ఉన్నా నిజాయితీగా తీసే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

విద్యార్థులతో సరదా ముచ్చట్లు:

కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా కమల్ మాట్లాడారు.ప్రశ్నలు అడిగే తత్వాన్ని అలవరుచుకోవాలని దేన్నీ గుడ్డిగా నమ్మకూడదని సూచించారు.కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడు తమ మధ్య ఉండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు పంచుకోవడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు.