
DNews: Feb 14: హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 శేషాద్రిని రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ప్రేమ పేరుతో కొంతమంది దుర్మార్గులు అమ్మాయిల ప్రాణాలతో ఆటలాడుతున్నారని ఆయన తెలిపారు. వాలెంటైన్స్ డే సందర్భంగా అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిందని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసం చేస్తున్న రాక్షసులు ఉన్నారని ఆయన అన్నారు. వారి మాటలు నమ్మి ఇళ్లనుంచి బయటకు వచ్చే బాలికలు లైంగిక దాడులకు గురవుతున్నారని హెచ్చరించారు. వాలెంటైన్స్ డే రోజున యువకులు, యువతులు హోటళ్లలో గదులు తీసుకునే సందర్భంలో హోటల్ యజమానులు వారి సర్టిఫికెట్లను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. మైనర్లకు గదులు అద్దెకు ఇచ్చి, పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్టపరమైన శిక్షలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.
