
DNews:14 Feb: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన మరియు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శమంత తన డివిజన్ (19వ డివిజన్)లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆమె ప్రచారానికే కాకుండా, నామినేషన్ వేసేందుకే తన సొంత పాత పన్ను బకాయిలు రూ.8 కోట్లను మున్సిపాలిటీకి చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అభ్యర్థి ఓటమి: కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఓటర్లు ఆమెకు ఓటు వేయకపోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చివరకు ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. డబ్బుతో ఓట్లను కొనవచ్చనే అభ్యర్థుల నమ్మకానికి ఈ ఫలితాలు పెద్ద షాక్‌గా మారాయి.
