
DSports 12Feb 2026:ముంబై/న్యూయార్క్: ఇప్పటికే రెండు టీ20 ప్రపంచకప్‌లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు ముద్దాడిన రోహిత్ శర్మకు ఇంకా ఏదో వెలితిగా ఉంది. బుధవారం ఐసీసీ నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న హిట్‌మ్యాన్, తన కెరీర్‌లో మిగిలి ఉన్న ఏకైక మరియు అతిపెద్ద కల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. 2027లో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలవడమే తన అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
- “నేను వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగాను. నా చిన్నతనంలో టీ20 వరల్డ్ కప్ కానీ, ఐపీఎల్ కానీ లేవు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఆ టోర్నీనే అత్యున్నతమైనదిగా భావించేవాళ్లం” అని రోహిత్ పేర్కొన్నారు.2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం రోహిత్‌కు ఇప్పటికీ ఒక పెద్ద అసంతృప్తిగా ఉంది. 2023లో సారథిగా జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లినా, తృటిలో చేజారిన ఆ ట్రోఫీని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. “నా దేశం కోసం ఆ ట్రోఫీని గెలవాలని ఉంది. దాన్ని సాధించేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను” అని రోహిత్ తన కసిని వెల్లడించారు.
