DET:FEB 12:
తనయ కోసం తండ్రి ప్రేమ సీత పయనం:
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అనగానే మనకు దేశభక్తి సినిమాలు భారీ ఫైట్లు గుర్తుకు వస్తాయి.కానీ ఇప్పుడు ఆయన ఒక తండ్రిగా తన బాధ్యతను సరికొత్తగా చాటుకుంటున్నారు.తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో సీత పయనం’అనే సినిమాను ఆయన స్వయంగా రూపొందిస్తున్నారు.ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు తన కూతురికి తండ్రి ఇస్తున్న ఒక వెలకట్టలేని బహుమతి అని అర్జున్ భావిస్తున్నారు.

ఐశ్వర్య కోసం ఒక మంచి కథ:

ఐశ్వర్య గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమె ప్రతిభను పూర్తి స్థాయిలో చూపించే సరైన అవకాశం రాలేదని అర్జున్ అభిప్రాయపడ్డారు.అందుకే ఒక తండ్రిగా తన కుమార్తెకు ఎలాంటి పాత్ర సెట్ అవుతుందో ఆలోచించి ఈ కథను సిద్ధం చేశారు.నా బిడ్డ కోసం నేను ఇవ్వగలిగే అతిపెద్ద గిఫ్ట్ ఒక మంచి సినిమా అని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.ఈ సినిమాలో ఐశ్వర్య నటన చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

తండ్రి దర్శకత్వంలో కూతురు:
సాధారణంగా తండ్రి దగ్గర కూతుళ్లు గారబంగా ఉంటారు.కానీ షూటింగ్ సెట్‌లో మాత్రం అర్జున్ చాలా సీరియస్ డైరెక్టర్.ఐశ్వర్య కూడా తన తండ్రి నుంచి నటనలో మెలకువలు నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తోంది.వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.కేవలం నటన మాత్రమే కాకుండా సినిమా టెక్నికల్ వాల్యూస్ విషయంలో కూడా అర్జున్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇది ఒక ప్రయాణం:

సీత పయనం అనే పేరులోనే ఒక భావం ఉంది.ఒక మహిళ తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు ఆమె ప్రయాణం ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతున్నాయి.ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.అర్జున్ తన అనుభవాన్నంతా ఉపయోగించి కూతురిని వెండితెరపై ఒక మెరుపులా చూపించాలని కష్టపడుతున్నారు.ఈ చిత్రం ద్వారా ఐశ్వర్యకు మంచి బ్రేక్ వస్తుందని అర్జున్ గట్టిగా నమ్ముతున్నారు.