DET:FEB 12:
తొలి అడుగులకు కృతజ్ఞతలు:
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగిన చిరంజీవి తాను ఈ స్థాయిలో ఉండటానికి పునాది వేసిన వ్యక్తులను ఎన్నటికీ మరువనని చాటిచెప్పారు.తన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై దశాబ్దాలు గడిచినా తనకు మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాత క్రాంతి కుమార్ గారికి దర్శకుడు కె.వాసు గారికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక నోట్‌ను పంచుకున్నారు.

ప్రయాణం మొదలైన వేళ:
చిరంజీవి తన లేఖలో.. ఒక సామాన్య యువకుడైన నన్ను వెండితెరకు పరిచయం చేసి నాలోని నటుడిని గుర్తించిన గొప్ప వ్యక్తులు వారు.నా సినీ ప్రయాణానికి ఆరంభం ఆ సినిమానే అని పేర్కొన్నారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో వారు అందించిన ప్రోత్సాహం నేర్పిన పాఠాలే తనను ఈరోజు మెగాస్టార్ గా నిలబెట్టాయని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

గురువులకు ఇచ్చే గౌరవం:

సినిమా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోకూడదని చిరంజీవి ఎప్పుడూ చెబుతుంటారు.ఇప్పుడు తన మొదటి చిత్ర బృందాన్ని స్మరించుకోవడం ద్వారా ఆయన తన సంస్కారాన్ని చాటుకున్నారు.ముఖ్యంగా దర్శకుడు కె.వాసు గారు తనను మలచిన తీరును నిర్మాత క్రాంతి కుమార్ గారి ధైర్యాన్ని ఆయన కొనియాడారు.

అభిమానుల ప్రశంసలు:

చిరంజీవి రాసిన ఈ నోట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.నిజమైన స్టార్ అంటే తన గతాన్ని మర్చిపోని వాడే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.తన సినీ కెరీర్‌లో ఎందరో దర్శకులు నిర్మాతలతో పనిచేసినా మొదటి సినిమా ఇచ్చిన అనుభూతి ఆ వ్యక్తుల పట్ల గౌరవం ఎప్పటికీ ప్రత్యేకమేనని చిరంజీవి మరోసారి నిరూపించారు.