
DSports 12Feb 2026:కొలంబో/ఇస్లామాబాద్: భారత్-పాక్ మ్యాచ్ అంటేనే అటు మైదానంలోనూ, ఇటు మైదానం వెలుపల కూడా సెగలు పుడుతుంటాయి. ఈ నెల 15న (ఆదివారం) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న మహా సమరానికి ముందు పాక్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు ప్రయోజనం చేకూర్చేలా ఐసీసీ (ICC) పిచ్‌ను మార్చే అవకాశం ఉందంటూ ఆయన ఆరోపించారు.
- పాకిస్థాన్‌కు చెందిన ఒక టీవీ షోలో పాల్గొన్న సక్లైన్, భారత్‌తో జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.పిచ్ ట్యాంపరింగ్ “ఆధునిక టెక్నాలజీ, గ్రౌండ్స్‌మెన్ సాయంతో మ్యాచ్‌కు ముందే పిచ్ స్వభావాన్ని మార్చేయవచ్చు. ఐసీసీ ఎవరి ప్రభావంలో ఉందో మనందరికీ తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.బీసీసీఐ ప్రభావం ఐసీసీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, భారత్ గెలిచేలా స్పిన్‌కు లేదా బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ను సిద్ధం చేయవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.పాక్ వ్యూహాలకు గండి పాకిస్థాన్ జట్టు కొలంబోలో గత రెండు వారాలుగా ఆడుతోందని, అయితే భారత్‌తో మ్యాచ్ సమయానికి పిచ్‌ను పూర్తిగా మార్చేసి పాక్ ప్రణాళికలను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
