DSports 12Feb 2026:కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-‘బి’ పోరులో కంగారూలు 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. పేసర్ నాథన్ ఎల్లిస్, స్పిన్నర్ ఆడమ్ జంపా తమ పదునైన బౌలింగ్‌తో ఐరిష్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఇద్దరూ తలో నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చేశారు.

  • టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.మార్కస్ స్టోయినిస్ (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, జోష్ ఇంగ్లిస్ (37), మ్యాట్ రెన్‌షా (37) అతనికి చక్కని సహకారం అందించారు.ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు తీశాడు.
  • 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. నాథన్ ఎల్లిస్ తన తొలి స్పెల్‌లోనే మూడు వికెట్లు తీసి ఐర్లాండ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఎల్లిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మధ్య ఓవర్లలో ఆడమ్ జంపా తన స్పిన్ మ్యాజిక్‌తో మిగతా పని పూర్తి చేశాడు. 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.వీరిద్దరి ధాటికి ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జార్జ్ డాక్రెల్ (41) మినహా ఎవరూ పోరాడలేకపోయారు.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana