DSports 10Feb 2026:కొలంబో/ముంబై: భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పర్యాటక రంగంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న సందిగ్ధత తొలగిపోవడంతో, అభిమానులు భారీగా కొలంబోకు ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. దీని ప్రభావంతో భారత్ నుంచి కొలంబోకు విమాన టికెట్ల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి.

  • పాక్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన సోమవారం రాత్రి నుంచి టికెట్ల బుకింగ్స్ వెల్లువెత్తాయి. కేవలం 30 నుంచి 60 నిమిషాల వ్యవధిలోనే ముంబై-కొలంబో విమాన టికెట్ల ధరలు రూ.10,000 మేర పెరగడం గమనార్హం. సాధారణంగా రూ.15,000 – రూ.20,000 ఉండే రౌండ్ ట్రిప్ ధరలు ప్రస్తుతం రూ.60,000 మార్కును దాటేశాయి. ఇక్కడ కూడా టికెట్ ధరలు 200 శాతం పెరిగి రూ.70,000 వరకు పలుకుతున్నాయి.అతి తక్కువ దూరమైనప్పటికీ, ఇక్కడి నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్లు దొరకడమే కష్టంగా మారింది.
  • విమాన ధరలే కాకుండా కొలంబోలోని హోటల్ పరిశ్రమ కూడా భారీ లాభాలను ఆర్జిస్తోంది. ప్రేమదాస స్టేడియం పరిసరాల్లోని లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 95 శాతం బుక్ అయిపోయాయి. మిగిలిన గదుల ధరలను హోటల్ యాజమాన్యాలు సాధారణం కంటే 5 రెట్లు పెంచేశాయి. ఒక్క రోజు బసకే కొన్ని చోట్ల రూ.40,000 నుంచి రూ.50,000 వరకు వసూలు చేస్తున్నారు.