
DSports 10Feb 2026:కొలంబో/ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు స్వయంగా ఫోన్ చేసిన దిసనాయకే, తమ విజ్ఞప్తిని మన్నించి మ్యాచ్‌కు అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో గత కొద్దిరోజులుగా ఈ మెగా పోరుపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.
- “మనందరం ఎంతో ఇష్టపడే ఈ క్రీడ (క్రికెట్) సజావుగా సాగేలా చూసినందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరగనుండటం సంతోషకరం. 1996 ప్రపంచకప్ సమయంలో శ్రీలంకలో భద్రతా సమస్యలు ఉన్నప్పుడు భారత్, పాక్ దేశాలు మాకు అండగా నిలిచిన విషయాన్ని మేము ఎన్నటికీ మరువలేము.”
- ఈ మ్యాచ్ జరగకపోతే శ్రీలంక క్రికెట్ బోర్డుకు మాత్రమే కాకుండా, దేశ పర్యాటక రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని దిసనాయకే గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆయన స్వయంగా రంగంలోకి దిగి పాక్ ప్రధానితో చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా పాక్‌కు మద్దతు తెలపడం, ఐసీసీ కొన్ని హామీలు ఇవ్వడంతో పాక్ తన ‘బహిష్కరణ’ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
