DSports 10Feb 2026:ముంబై/ఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక అత్యంత కీలకమైన మరియు కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. టోర్నీ జరుగుతున్నంత కాలం భారత ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో (భార్యలు, పిల్లలు, ఫియాన్సీలు) కలిసి ఉండకూడదని బోర్డు స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ) భారత్ 3-1తో ఓడిపోవడంపై సమీక్ష నిర్వహించిన బీసీసీఐ, ఆటగాళ్లు ఆట కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తించింది. కొందరు ఆటగాళ్లు టీమ్ మీటింగ్‌లకు కూడా డుమ్మా కొట్టడంతో, ఈసారి స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో అలాంటి పొరపాట్లు జరగకూడదని ఈ ఆంక్షలు విధించింది.
  • ఆటగాళ్లు బస చేసే హోటల్ గదుల్లో కుటుంబ సభ్యులకు అనుమతి లేదు. వారు రావాలనుకుంటే సొంత ఖర్చులతో వేరే చోట బస చేయాల్సి ఉంటుంది. ప్లేయర్లు కేవలం టీమ్ బస్సులోనే ప్రయాణించాలి. సొంత వాహనాలు లేదా ప్రైవేట్ కార్లలో ప్రయాణించడంపై నిషేధం విధించారు.
    ప్లయర్ల వ్యక్తిగత మేనేజర్లు, ప్రైవేట్ చెఫ్‌లు టీమ్ హోటల్‌లోకి రావడానికి వీల్లేదు.ప్రాక్టీస్ సెషన్లు మరియు టీమ్ మీటింగ్‌లకు ప్రతి ఒక్కరూ హాజరుకావాల్సిందే. ఎవరికీ మినహాయింపు ఉండదు.
  • మరోవైపు, టీ20 ప్రపంచకప్‌లో తమతో ఆడేందుకు పాకిస్థాన్ (PCB) పెట్టిన షరతులను బీసీసీఐ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భవిష్యత్తులో పాక్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు (Bilateral Series) ఆడే ప్రసక్తే లేదని, కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతామని బీసీసీఐ మరోసారి తన పాత వైఖరిని స్పష్టం చేసింది.