
DSports 10Feb 2026:దుబాయ్/ఢాకా: టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఊహించని భారీ ఊరటనిచ్చింది. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని బంగ్లాదేశ్ తప్పుకోవడంతో, ఆ జట్టుపై కఠినమైన ఆంక్షలు లేదా భారీ జరిమానా విధిస్తారని అందరూ భావించారు. కానీ, ఐసీసీ తాజా సమావేశంలో బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఆర్థిక లేదా పరిపాలనాపరమైన జరిమానాలు (Sanctions) విధించకూడదని నిర్ణయించింది.
- టోర్నీ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎటువంటి జరిమానా విధించలేదు. ఇది బీసీబీకి ఆర్థికంగా పెద్ద ఊరట. 2028 నుంచి 2031 మధ్య కాలంలో బంగ్లాదేశ్ ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేలా ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఆటంకం కలగదు.ఒక మెగా టోర్నీని బహిష్కరించినప్పటికీ, ఐసీసీలో బంగ్లాదేశ్ యొక్క ‘ఫుల్ మెంబర్’ హోదాకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.
- బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుని భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధపడటం, ఈ వివాదం సద్దుమణగడానికి ప్రధాన కారణమైంది. “క్రికెట్ స్ఫూర్తిని కాపాడటంలో బంగ్లాదేశ్ చూపిన చొరవను అభినందిస్తున్నాం” అని ఐసీసీ ప్రతినిధి పేర్కొన్నారకాగా, ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని స్కాట్లాండ్ జట్టు భర్తీ చేసింది. గ్రూప్-సిలో బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్‌లను ఇప్పుడు స్కాట్లాండ్ అదే షెడ్యూల్ ప్రకారం ఆడుతోంది.
