
DNews: Feb 07: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేసవరావు గారి కుమారుడు వెంకట్‌పై బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ఘటన చోటుచేసుకుంది. బంజారా హిల్స్‌లోని ఒక ఇంటి రెగ్యులరైజేషన్ అంశంపై పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేస్తామని కొంతమంది బెదిరించి, దాన్ని ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో మరిన్ని కేసులు వేస్తామని ఒత్తిడి చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడిల రఘువీర రెడ్డి, అన్వేష్ రెడ్డి అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తూ, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
