DNews: Feb 05: చెవెళ్లలో సంచలనం రేపిన అడ్వకేట్ గోటికే స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. చెవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్నను ఆమె సొంత అన్న రాముడు (గోటికే రాజు) ఆస్తి వివాదం కారణంగా పన్నిన పథకం ప్రకారం హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మోయినాబాద్ ప్రాంతంలో ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు వెల్లడిస్తూ, ఈ కేసులో నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ హత్య పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని, కారణం సర్వే నంబర్ 339లోని నాలుగు ఎకరాల భూమి వివాదమేనని తెలిపారు. స్వప్న మరియు రాజు మధ్య భూవివాదం తీవ్రంగా ఉండగా, భూమిని తన పేరుకు మార్చుకోవాలని లేదా స్వాధీనం చేసుకోవాలని రాజు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన చెల్లెలు అడ్డంకిగా ఉందని భావించి ఆమెను హత్య చేశాడు.
ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు: A1 గోటికే రాజు (స్వప్న సొంత అన్న – ప్రధాన నిందితుడు), A2 ఎర్రొల్ల సందీప్, A3 వడ్డే వీరేశం, A4 కావలి శివలింగం. హత్య విధానం అత్యంత క్రూరంగా జరిగిందని పోలీసులు తెలిపారు. స్వప్న తన వ్యవసాయ భూమికి సర్వే కోసం వెళ్లిన సమయంలో నిందితులు ఆమెను ఇన్నోవా కారుతో ఢీకొట్టారు. ఆమె కిందపడగానే రాళ్లు, కర్రలతో దాడి చేసి, చివరికి మాచేతీతో గొంతు కోసి అక్కడికక్కడే హత్య చేశారు. అనంతరం నిందితులు ఇన్నోవా కారులో, స్కూటీలో అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు నిందితుల వద్ద నుండి ఆయుధాలు, ఇన్నోవా వాహనం, స్కూటీ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చెవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్న ధైర్యవంతురాలిగా, వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా గౌరవనీయురాలిగా పేరుపొందారు. ఆమెను సొంత అన్న హత్య చేయడం సహచర న్యాయవాదులను తీవ్రంగా కలచివేసింది. ఈ విషాదకర ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana