D Spiritual: Feb 4: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 13 (శుక్రవారం) నుంచి 17 (మంగళవారం) వరకు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే 18 (బుధవారం) నుంచి 20 (శుక్రవారం) వరకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు జరగనున్నాయి.

ఈ క్రమంలో 13న ఉదయం 8 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు మంగళ స్నానాలు నిర్వహించి, వధూవరులుగా అలంకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, బలిహరణ, హారతి, మంత్రపుష్పం అనంతరం తీర్ధ ప్రసాద వినియోగం జరుగుతుంది. 14, 15 తేదీల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నిత్య పూజలు నిర్వహిస్తారు.

15వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు మహాన్యాసం, లింగోద్భవ కాల అభిషేకం, మహా నివేదన, హారతి, మంత్రపుష్పాల అనంతరం “శ్రీ గంగా కనకదుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల దివ్య లీలా కళ్యాణోత్సవము” ఘనంగా జరుగుతుంది.

16న సోమవారం నిత్య పూజలు అనంతరం సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా కనకదుర్గా నగర్ మీదుగా బ్రాహ్మణ వీధి, పాత శివాలయం, మెయిన్ బజార్, కెనాల్ రోడ్డు మార్గంలో రథోత్సవంగా సాగి తిరిగి శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు.

17న మంగళవారం ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, వసంతోత్సవం అనంతరం దుర్గా ఘాట్‌లో అవభృతోత్సవం, ధ్వజావరోహణం నిర్వహించబడతాయి.

అమ్మవార్ల కళ్యాణోత్సవ ఆర్జిత సేవలు 18 నుంచి 20 వరకు కొనసాగనున్నాయి. ఈ రోజుల్లో పంచ హారతులు, ద్వాదశ ప్రదక్షిణలు అనంతరం పవళింపు సేవ నిర్వహించబడుతుందని ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. మహాశివరాత్రి రోజైన 15న శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొనే దంపతులకు ఉభయ రుసుము రూ.1,116/-గా నిర్ణయించారు. పాల్గొన్న భక్తులకు శేషవస్త్రం, రవిక, శ్రీచక్ర లడ్డు ప్రసాదం అందజేస్తారు.

ఇదే సందర్భంగా నిత్యాన్నదాన విరాళ దాతలుగా హైదరాబాద్ వాసులు చల్లా చంద్రమౌళి–సరోజిని దంపతులు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని నిరతాన్నదాన పథకానికి రూ.1,00,000/- విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కు అందజేశారు. అనంతరం వారికి అమ్మవార్ల దర్శనానంతరం వేద పండితులచే వేదాశీర్వచనం, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana