DNews:04 Feb: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ (GHMC) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. కూకట్‌పల్లి జోనల్ ఆఫీసులో ఎస్‌ఈ (Superintending Engineer)గా పనిచేస్తున్న చిన్నారెడ్డి, ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఒక టెండర్ విషయంలో ఆఫీషియల్ ఫేవర్‌ చేసేందుకు చిన్నారెడ్డి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.బాధితుడి ఫిర్యాదుతో రంగంలోలోకి దిగిన ఏసీబీ అధికారులు, పక్కా పథకం ప్రకారం ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. చిన్నారెడ్డి చేతి వేళ్లకు జరిపిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు.

ఇదే కార్యాలయంలో మ్యూటేషన్ (ఆస్తి మార్పిడి) విషయంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ విభాగానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ కూడా ఏసీబీకి పట్టుబడటం గమనార్హం.ప్రస్తుతం చిన్నారెడ్డి నివాసం మరియు ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను సేకరించే పనిలో ఉన్నారు.జీహెచ్‌ఎంసీలో ఇంత పెద్ద మొత్తంలో ఒక ఉన్నతాధికారి పట్టుబడటం నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana