
D Spiritual: Feb 4: శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఘనంగా కొనసాగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వామివారి ఆలయం పూర్తిగా సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 8న ఉదయం ధ్వజారోహణం (కుంభ లగ్నం – ఉదయం 8.15 నుంచి 8.35 గంటల వరకు) నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహన సేవ జరుగుతుంది.
ఫిబ్రవరి 9న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం సేవలు జరుగనున్నాయి.
ఫిబ్రవరి 11న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12న ఉదయం పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం), రాత్రి గరుడ వాహనం సేవలు జరుగుతాయి.
ఫిబ్రవరి 13న ఉదయం హనుమంత వాహనం, మధ్యాహ్నం వసంతోత్సవం (మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు), సాయంత్రం స్వర్ణరథం (సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు) నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి గజ వాహనం సేవ జరుగుతుంది.
ఫిబ్రవరి 14న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం సేవలు జరుగుతాయి.
ఫిబ్రవరి 16న ఉదయం చక్రస్నానం (ఉదయం 9.55 నుంచి 10.15 గంటల వరకు) నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణం (సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు)తో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
