
DNews: Feb04: ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ షాది.కామ్‌లో జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లు సైబర్ నేరస్థులకు అడ్డంకిగా మారుతున్నాయని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం షాది.కామ్‌లో జరిగిన ఒక పెద్ద మోసం కేసులో కంపెనీ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఆ సందర్భంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. దీనిని అత్యున్నత న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించింది. మ్యాట్రిమోనియల్ సైట్‌లు వినియోగదారుల వివరాలను సరిగ్గా ధృవీకరించడం లేదని, దీనివల్ల సైబర్ నేరస్థులకు ఇది సులభతరం అవుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
