
DNews: Feb04: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపైనే ఇద్దరి మధ్య ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుండి త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగింటిలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెరో రెండు స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభలో ఇప్పటివరకు జనసేనకు ప్రాతినిధ్యం లేకపోవడంతో, ఖాళీగా ఉన్న ఈ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలో కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం ఇంత కాలం కొనసాగడానికి రాజ్యసభ ఎన్నికలే కారణమని సమాచారం.
