
DSports 02Feb 2026:ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలకమైన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడంతో యూపీ వారియర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో ఆ జట్టు ఖాతాలోకి వచ్చిన ఆ ‘అన్ వాంటెడ్’ రికార్డు వివరాలు ఇలా ఉన్నాయి:
- కెప్టెన్ మెగ్ లానింగ్ మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. ముఖ్యంగా కిరణ్ నవ్‌గిరే ఫామ్ కోల్పోవడం జట్టును దెబ్బతీసింది.ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో యూపీ కేవలం 2 మాత్రమే గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది.స్టార్ స్పిన్నర్లు సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ ఉన్నప్పటికీ.. కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. డీన్డ్రా డాటిన్ ఒకే ఓవర్లో 32 పరుగులు ఇచ్చి ఓవర్సీస్ బౌలర్‌గా అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డును కూడా ఈ సీజన్లోనే మూటగట్టుకుంది.
