DSports 02Feb 2026:టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే దాయాదుల పోరుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో తమ జట్టు పాల్గొంటుందని, అయితే ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు (Boycott) పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.

  • పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మధ్య జరిగిన కీలక భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. “పాక్ జట్టు ప్రపంచకప్‌లో ఆడుతుంది, కానీ ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం మైదానంలోకి దిగదు” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరగా, ఐసీసీ నిరాకరించింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకుంది. పాక్ నిర్ణయంపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. “సెలెక్టివ్ పార్టిసిపేషన్” (నచ్చిన మ్యాచ్‌లే ఆడటం) అంతర్జాతీయ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని హెచ్చరించింది.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana