
DSports 28Jan 2026:వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఊపిరి బిగబట్టేలా చేసింది. గెలుపు ముంగిట వరకు వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆఖరి ఓవర్‌లో సోఫీ డివైన్ వేసిన ‘మ్యాజిక్’ బౌలింగ్‌కు తలవంచి 3 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
- 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నిక్కీ ప్రసాద్ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నిక్కీ ప్రసాద్ ఫోర్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మలుపు తిరిగింది. వీరిద్దరూ కలిసి 7వ వికెట్‌కు కేవలం 31 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీకి గెలుపు ఆశలు కల్పించారు.
- అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ (58) అర్ధసెంచరీతో రాణించగా, అనుష్క శర్మ (39) మెరుపులు మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లతో ఆకట్టుకుంది.
