D Spiritual: Jan 27: అపార బలానికి, అచంచల భక్తికి ప్రతీకగా నిలిచే హనుమంతుడికి యాలకులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు వివరిస్తున్నారు. ఈ నైవేద్యం భక్తుల్లో మనోధైర్యాన్ని పెంపొందించడమే కాకుండా, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ముందుకు సాగేందుకు దోహదపడుతుందని విశ్వాసం.

హనుమంతుడికి (Hanuman Pooja) యాలకులు అర్పించడం పేదరికాన్ని తొలగించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తిని కలిగిస్తుందని ఆధ్యాత్మిక వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో పాటు అనవసర ఖర్చులు తగ్గి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

ఈ పూజా విధానం ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు, కొత్త అవకాశాలు తెస్తుందని విశ్వాసం ఉంది. అలాగే వ్యాపారస్తులకు లాభాలు పెరిగి, స్థిరమైన వృద్ధి సాధించే అవకాశాలు మెరుగవుతాయని పండితులు పేర్కొంటున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana