
DET:JAN 27:
టాలీవుడ్ సినీ ప్రియులకు ఈ వారం డబుల్ ధమాకా లభించింది.మాస్ మహారాజా రవితేజ తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించగా యంగ్ హీరో నితిన్ కూడా ఒక విభిన్నమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
మాస్ మహారాజా ఇరుముడి:
రవితేజ తన 77వ చిత్రాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.ఈ సినిమాకు ఇరుముడి అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ చిత్రానికి నిన్ను కోరి,మజిలీ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాలధారణలో తలపై ఇరుముడితో కనిపిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
నితిన్ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం:
మరోవైపు యంగ్ హీరో నితిన్ తన 36వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం విశేషం.ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌లో నో బడీ.. నో రూల్స్ అనే క్యాప్షన్ ఇచ్చి క్యూరియాసిటీని పెంచారు.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.
కొత్త కాంబినేషన్ల క్రేజ్:
రవితేజ ఇప్పటికే శివ నిర్వాణ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి చాలా కాలంగా ఆసక్తిగా ఉన్నారు.వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ చిత్రం ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.అలాగే నితిన్ కూడా వరుస కమర్షియల్ చిత్రాల తర్వాత తన పంథా మార్చుకుని సై-ఫై జోనర్‌లోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఈ రెండు సినిమాలు కూడా 2026లోనే సెట్స్ పైకి వెళ్లి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
