
DET:JAN 27:
విజయ్ సేతుపతి తన సహజ సిద్ధమైన నటనతోనే కాదు తనదైన హాస్యంతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.ఇటీవల ద కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆయన తాను అసలు నటనలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో చెబుతూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.
నటనలోకి రావడానికి అసలు కారణం ఇదే!
సాధారణంగా నటులు తమకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఇష్టమని కళ మీద మక్కువతో వచ్చామని చెబుతుంటారు.కానీ విజయ్ సేతుపతి మాత్రం చాలా ప్రాక్టికల్‌గా సమాధానం ఇచ్చారు.నా దగ్గర డబ్బులు లేవు అందుకే నటనను ఎంచుకున్నాను అని ఆయన చెప్పగానే కపిల్ శర్మతో పాటు సెట్‌లోని వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.ఎటువంటి ఫిల్టర్లు లేకుండా ఆయన చెప్పిన ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాధ్యతలు పెరగడం వల్లే ఈ నిర్ణయం:
విజయ్ సేతుపతి తన గత జీవితం గురించి మాట్లాడుతూ.. అప్పట్లో తనకు పెళ్లయిందని,ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానని తెలిపారు.ఆ సమయంలో తనకు వేరే దారి కనిపించలేదని కేవలం డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశంతోనే సినిమా రంగం వైపు అడుగులు వేశానని స్పష్టం చేశారు.ఆయన నిజాయితీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కపిల్ శర్మ షోలో సందడి:
ఈ షోలో విజయ్ సేతుపతి తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ షో మొత్తాన్ని సందడిగా మార్చేశారు.కేవలం గంభీరమైన పాత్రలే కాదు రియల్ లైఫ్‌లో తాను ఎంత సరదాగా ఉంటారో మరోసారి నిరూపించారు.ఆయన మాటలకు కపిల్ శర్మ కూడా ఫిదా అయిపోయి సేతుపతి సింప్లిసిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
