D Spiritual Jan 27: సాధారణంగా హనుమంతుడికి పెళ్లి కాలేదని, ఆయన ఆజన్మ బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. నిత్య జీవితంలో సరదాగా కూడా ఎవరికైనా “పెళ్లెప్పుడు?” అని అడిగితే “ఆంజనేయుడికి పెళ్లెప్పుడు?” అని అంటుంటారు. కానీ పురాణ కథల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని చెబుతారు. ఆయన భార్య పేరు సువర్చల. అయితే వివాహం చేసుకున్నప్పటికీ హనుమంతుడు బ్రహ్మచారిగానే కొనసాగడంతోనే ఆయనను ఆజన్మ బ్రహ్మచారి అని పిలుస్తారని కథనం.

హనుమంతుడికి సూర్యుడు గురువుగా ఉంటాడు. సూర్యుడు నవ వ్యాకరణ పండితుడు కావడంతో ఆయన వద్ద హనుమంతుడు ఎన్నో విద్యలను అభ్యసించాడు. అయినప్పటికీ ఇంకా కొన్ని విద్యలు నేర్చుకోవాల్సి ఉందని సూర్యుడు తెలిపారు. అయితే ఆ విద్యలను పొందాలంటే హనుమంతుడు వివాహితుడై ఉండాలని, లేకపోతే సంపూర్ణ జ్ఞానం లభించదని సూర్యుడు చెప్పాడట.

ఈ విషయంతో హనుమంతుడు సందిగ్ధంలో పడగా, సూర్యుడే దీనికి పరిష్కార మార్గాన్ని సూచించాడట. తన తపోశక్తితో ఒక ఆడపిల్లకు ప్రాణం పోసి ఆమెకు సువర్చల అని పేరు పెట్టాడట. అనంతరం ఆ సువర్చలను వివాహం చేసుకోవాలని ఆంజనేయుడికి సూచించాడట. అలాగే వివాహం అనంతరం సువర్చల తపస్సులో లీనమవుతుందని, అలా నువ్వు బ్రహ్మచారిగానే కొనసాగుతావని సూర్యుడు వివరించాడట.

సూర్యుని మాటలకు అంగీకరించిన హనుమంతుడు సువర్చలను వివాహం చేసుకున్నాడట. వెంటనే సువర్చల తపస్సులోకి వెళ్లిపోవడంతో, ఆంజనేయుడు బ్రహ్మచారిగా మిగిలిపోయాడని పురాణ గాథ చెబుతోంది. ఈ విధంగానే వివాహం జరిగినప్పటికీ హనుమంతుడిని ఆజన్మ బ్రహ్మచారిగా పిలుస్తారని విశ్వాసం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana