
D Spiritual: Jan 24: రథసప్తమి రోజున సూర్యభగవానుడు ఏడు గుర్రాల రథంపై దర్శనమిస్తాడని పౌరాణిక విశ్వాసం ఉంది. ఈ పవిత్ర పర్వదినాన సూర్యుడిని ఆరాధించడం వల్ల మృత్యుభయం తొలగిపోతుందని, సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే రథసప్తమిని సూర్యారాధనకు అత్యంత శుభదినంగా భావిస్తారు.
మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున సూర్యుడు అవతరించాడని పురాణాలు పేర్కొంటాయి. ఈ కారణంగా ఈ రోజుకు విశేష ప్రాధాన్యత ఉంది. రథసప్తమి సందర్భంగా సూర్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ రోజున నదీ స్నానాలు చేయడం, సూర్యోపాసనలు చేయడం, తలపై ఆకులు పెట్టుకుని స్నానం చేయడం, నదీ తీరాలలో దీపారాధన నిర్వహించడం వంటి ఆచారాలు పాటిస్తే అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
అలాగే రథసప్తమి రోజున ఎరుపు రంగు పూలతో సూర్యభగవానుని పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ విధంగా సూర్యారాధన చేయడం వల్ల జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.
