
DSports 23Jan 2026:వడోదర: ఓటమి పరంపరను వీడి గుజరాత్ జెయింట్స్ జైత్రయాత్ర మొదలుపెట్టింది. బ్యాటింగ్‌లో సోఫీ డివైన్ విశ్వరూపం చూపగా, బౌలింగ్‌లో రాజేశ్వరి గైక్వాడ్ మాయాజాలం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ 17.3 ఓవర్లలో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది.
- టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ ఆష్లే గార్డెనర్ (5) త్వరగానే వెనుదిరిగింది. అయితే, కివీస్ స్టార్ సోఫీ డివైన్ (42 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకుంది. ఆమెకు తోడుగా బెత్ మూనీ (38) విలువైన పరుగులు జోడించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. యూపీ బౌలర్లలో క్రాంతి గౌడ్, సోఫీ ఎకిల్‌స్టోన్ తలో రెండు వికెట్లు తీశారు.
- 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే డకౌట్ కాగా, కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (14) కూడా నిరాశపరిచింది.తన పునరాగమన మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి యూపీ నడ్డి విరిచింది.వీరు చెరో రెండు వికెట్లతో యూపీ మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. యూపీ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (32), క్లో ట్రయాన్ (30) కొంత ప్రతిఘటించినా, మిగతా వారంతా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.
- ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ పట్టికలో ఆఖరి స్థానం నుండి నేరుగా రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గుజరాత్ 3 విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే అగ్రస్థానంలో ఉండి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
