
DSports 23Jan 2026:జకార్తా: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ హోజ్‌మార్క్ జాయర్‌ఫెల్డ్‌ను ఓడించడం ద్వారా, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్‌లో 500 విజయాలు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
దాదాపు 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-19, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి గేమ్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి గట్టి పోటీనిచ్చినప్పటికీ, నిర్ణయాత్మక సమయాల్లో సింధు తన అనుభవాన్ని ఉపయోగించి పాయింట్లు సాధించింది. రెండో గేమ్‌లో కూడా అదే దూకుడును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
