DSports Jan07 2026: మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్ తండ్రి మున్నా సింగ్ గౌడ్ గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. అయితే, 2012లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఆయన్ను ఉద్యోగం నుండి తొలగించారు (సస్పెండ్ చేశారు). అప్పటి నుండి ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. తాజాగా క్రాంతి గౌడ్ భారత మహిళల జట్టు 2025 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమె కుటుంబానికి అరుదైన కానుకను అందించింది.

“నా కూతురు వల్ల మళ్ళీ నా గౌరవం నాకు దక్కింది. ఇంతకంటే గర్వకారణం మరొకటి లేదు” అని మున్నా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు.