
DSports Jan07 2026: స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్ జట్టుకు సారథ్యం వహించనున్నారు. కేన్ విలియమ్సన్ తప్పుకున్న తర్వాత శాంట్నర్‌కే పగ్గాలు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. ఉపఖండంలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయనే ఉద్దేశంతో జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు కల్పించడం విశేషం.
2025లో అంతర్జాతీయ స్థాయిలో 81 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన 31 ఏళ్ల పేసర్ జాకబ్ డఫీకి తొలిసారి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. కీలక పేసర్లు లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీలు టోర్నీ సమయంలో తండ్రులు కాబోతుండటంతో వారికి స్వల్పకాలిక పితృత్వ సెలవులను బోర్డు మంజూరు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శాంట్నర్‌తో పాటు ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్ స్వల్ప గాయాలతో ఉన్నప్పటికీ, టోర్నీ సమయానికి వారు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని సెలక్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్ పేసర్ కైల్ జామిసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.
