DSports Jan07 2026:ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో యువరాజ్ మాట్లాడుతూ.. 2011 ప్రపంచకప్ తర్వాత తాను ఎదుర్కొన్న చేదు నిజాలను బయటపెట్టారు.

  • “నీకు కేవలం 3 నుంచి 6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది” అని వైద్యులు చెప్పినప్పుడు, చనిపోతాననే ఆలోచన తన మనసులో మొదటిసారి కలిగిందని యువీ ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ ట్యూమర్ తన ఊపిరితిత్తులు మరియు గుండె మధ్య భాగంలో ఉందని, అది నరాలపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని ఆయన వివరించారు. ఒకవేళ కీమోథెరపీ చేయించుకోకపోతే గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడంతో, అప్పటికే టెస్ట్ జట్టులో స్థానం కోసం 7 ఏళ్లుగా వేచి చూస్తున్న యువీ.. తన ఆశలను వదులుకుని చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. “నువ్వు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అసలు క్యాన్సర్ లేని వ్యక్తిగా వెళ్తావు” అని డాక్టర్ లారెన్స్ ఇన్‌హార్న్ ఇచ్చిన భరోసా తనను బ్రతికించిందని యువీ పేర్కొన్నారు.
  • “క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్ళీ బ్యాట్ పట్టుకున్నప్పుడు అది నాకు పునర్జన్మలా అనిపించింది.”