
DSports Jan6 2026:విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్లో నవశకాన్ని ఆరంభిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా మహిళల క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ను ఏసీఏ మహిళల క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా నియమించింది. ఏసీఏ అధ్యక్షుడు మరియు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మిథాలీ రాజ్ వంటి దిగ్గజం అండగా ఉండటం వల్ల ఆంధ్రా క్రికెటర్లకు మెరుగైన శిక్షణతో పాటు, జాతీయ జట్టులోకి వెళ్లేందుకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని క్రికెట్ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “మిథాలీ రాజ్ అనుభవం ఆంధ్ర క్రికెట్‌కు కొండంత బలం. మహిళా క్రికెటర్లకు ఆర్థికంగానూ, వసతుల పరంగానూ పురుష క్రికెటర్లతో సమానంగా ప్రాధాన్యత ఇస్తాం” అని కేసినేని శివనాథ్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన మిథాలీ, ఇప్పుడు ఆంధ్రా క్రికెట్ దశను ఎలా మారుస్తుందో చూడాలి!
